హైదరాబాద్: హయత్ నగర్ లో రాజేష్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ టీచర్ తో రాజేష్ సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ ను టీచర్ భర్త నాగేశ్వర్ రావు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాగేశ్వర్ రావు, ఆయన బంధువులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రభుత్వ ఉపధ్యాయురాలు మృతిచెందింది.
హయత్ నగర్ లో రాజేష్ కేసులో తనకు సంబంధం లేదని నాగేశ్వర్ రావు తెలిపారు. అతనిపై తాము దాడి చేశామని వస్తున్న వార్లల్లో వాస్తవం లేదన్నారు. రాజేష్ ఎవరో మాకు తెలియదని ఆయన వెల్లడించారు. నా భార్యను ఎవరో బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టారు. నా భార్య మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని నాగేశ్వరరావు పోలీసులను కోరాడు. తన భార్యకు, రాజేశ్ కు వయసులో చాలా వ్యత్యాసం ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా రాజేష్ పరిచయమై ఉండవచ్చని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.