చెన్నై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీపై ఆస్ట్రేలియా దిగ్గజం మాథూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ పనైపోయిందని, ఇప్పటికైనా అతడు ఈ వాషయాన్ని గనించాలని హితవు పలికాడు. చెన్నై, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ బాక్స్‌లో కూర్చున్న హెడెన్.. ‘ఈ సీజన్‌లో ధోనీ జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమవుతున్నాడని, ధోనీ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, సిక్సర్తో 30 పరుగులు చేసిఅజేయంగా నిలిచాడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు హెడెన్ ఎంఎస్ ధోనిని విమర్శించాడు. రన్ రేట్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ఎంఎస్ ధోనీ, విజయ్ శంకర్ వేగంగా స్కోరు చేయలేకపోయారని చెప్పాడు. ధోనీ ఇప్పుడు క్రికెట్ వదిలి కామెంటరీబాక్స్ వద్దకు వచ్చి అతనితో కూర్చోవాలని సెటైర్ విసిరాడు. ఇప్పటికే లేట్ అయిందని, త్వరగా వచ్చేయ్ అంటూ హెడెన్ మాట్లాడాడు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత కూడా ధోనిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
ముగింపు దశకు ధోనీ క్రికెట్ కెరీర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -