Monday, November 18, 2024

అధికార మత్తులో మునిగిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Hazare's letter to Kejriwal over liquor policy

కేజ్రీవాల్‌కు హజారే లేఖ… కొత్త మద్యం పాలసీపై ధ్వజం

పుణె: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం లోని ఢిల్లీ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన కేజ్రీవాల్‌కు ఘాటుగా లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికార మత్తులో పూర్తిగా మునిగిపోయినట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. మద్యం కొత్త విధానం మద్యం అమ్మకాలను. వినియోగాన్ని, అవినీతిని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. 202122 లో అమలైన ఢిల్లీ నూతన మద్యం విధానంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలని గత నెల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనా సిఫార్సు చేశారు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని తన గ్రామం రాలేగావ్ సిద్ధిలో సంపూర్ణ మద్య నిషేధం ఎలా అమలవుతోందో అన్నాహజారే ఉదహరిస్తూ మద్యపాన నిషేధానికి అనుకూలంగా ఆప్ మేనిఫెస్టో ‘స్వరాజ్’ కు పరిచయ వాక్యాలు తనతో కేజ్రీవాల్ రాయించినప్పటి సంగతి గుర్తు చేశారు.

ఆ మేనిఫెస్టోలో అనేక ఆదర్శవంతమైన విషయాలు రాశావని, ప్రతివారు వాటిపై ఎంతో ఆశించారని, ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ పూర్తిగా మరిచిపోయావని కేజ్రీవాల్‌ను తీవ్రంగా విమర్శించారు. ఒక పెద్ద చారిత్రాత్మక ఉద్యమం నుంచి ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇతర పార్టీల బాటలో ఉన్నట్టు హజారే ఆరోపించారు. లోక్‌పాల్ నియామకం జరగాలని డిమాండ్ చేస్తూ అన్నాహజారే 2011లో చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో హజారే, కేజ్రీవాల్ ఇద్దరూ కీలకమైన వ్యక్తులయ్యారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల విషయమే మరిచిపోయారు. పటిష్టమైన లోకాయుక్త చట్టాన్ని తీసుకురాడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేయలేదు సరికదా, దానికి బదులు ప్రజల జీవితాలను నాశనం చేసే ముఖ్యంగా మహిళలు వ్యతిరేకించే మద్యం పాలసీని తీసుకువచ్చారని హజారే కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని మీ మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో స్పష్టమౌతుందని హజారే కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News