Wednesday, January 22, 2025

ఆసీస్‌కు గట్టి షాక్!

- Advertisement -
- Advertisement -

భారత్‌తో ఫైనల్ టెస్టుకు హాజిల్‌వుడ్ దూరం

మెల్‌బోర్న్ : వరల్డ్ టెస్టు ఛాంపియన్స్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా గట్టి షాక్ తగిలింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమైనట్లు తెలిస్తోంది. ఆసీస్ జట్టు బౌలింగ్ భారాన్ని స్టార్క్‌తో కలిసి మోస్తున్న హాజిల్‌వుడ్ కొంత కాలం క్రితం గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా అతను ఎంపిక కాలేదు.

Also Read: చితిపై లేచికూర్చున్న శవం..పరుగులు తీసిన బంధుజనం

ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ కూడా ఆడలేదు. అయితే అనంతరం జరిగిన ఐపీఎల్ సగం ముగిసిన తర్వాత ఆర్సీబీతో చేరాడీ ఆసీస్ స్టార్. కానీ ఇక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఈ నెల 7 నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతను ఆసీస్‌కు చాలా కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో అదే గాయం తిరగబెట్టడంతో హాజిల్‌వుడ్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా బృందంలో మళ్లీ మార్పు చేయాల్సి వచ్చిది. అతని విషయంలో అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించి విశ్రాంతినిచ్చింది.

ఆసీస్ జట్టు ఇదే..
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారీస్, ట్రావిసె హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నెజర్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News