Monday, December 23, 2024

నటుడు నవాజుద్దీన్ కుటుంబానికి హైకోర్టు ఆదేశం!

- Advertisement -
- Advertisement -

ముంబై: తమ పిల్లలతో సహా కోర్టు ముందు ఏప్రిల్ 3న హాజరుకావాలని నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన మాజీ భార్య జైనాబ్ సిద్ధిఖీని బాంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. పిల్లల కోసం వారి మధ్య సఖ్యతను ఏర్పరచడానికి కోర్టు తుది ప్రయత్నం చేయనున్నది.

న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, షర్మీలా దేశ్‌ముఖ్‌తో కూడిన డివిజన్ ధర్మాసనం నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించనున్నది. ఇదిలావుండగా తన పిల్లలని తనకు తెలియకుండానే దుబాయ్ నుంచి భార్య తీసుకొచ్చేసిందని, దాని వల్ల వారి చదువులు పాడవుతున్నాయని ఆయన వాపోతున్నారు. దాంతో డివిజన్ బెంచ్ నటుడు, ఆయన మాజీ భార్య పిల్లలతో సహా ఏప్రిల్ 3న కోర్టు జడ్జీ ఛాంబర్‌లో ‘ఇన్ కెమెరా’ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

‘మేము పిల్లల గురించి చింతిస్తున్నాము…భార్యాభర్తలిద్దరి మధ్య ఓ అవగాహన ద్వారా రాజీ కుదుర్చాలనుకుంటున్నాము’ అని కోర్టు అభిప్రాయపడింది. నావాజుద్దీన్ సిద్ధిఖీ న్యాయవాది అద్నాన్ షేఖ్ ‘మేము ప్రతిపాదిత సమ్మతి పంపాము. ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఇంత వరకు జవాబులేదు. పరిష్కారం కుదరాలని వారు కోరుకోవడంలేదనిపిస్తోంది’ అన్నారు. దానికి జైనాబ్ తరఫు అడ్వొకేట్ చైతన్య పూరన్‌కర్ ‘ఆమె కూడా విషయాన్ని పరిష్కరించుకోవాలనుకుంటోంది’ అని వాదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News