Wednesday, January 22, 2025

కాపీ రైట్ వివాదంలో రాహుల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత్ జోడో యాత్ర సందర్భంగా కేజీఎఫ్ 2 సినిమా లోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్టు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్, సుప్రియ శ్రినాటే పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టి వేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా సోర్స్ కోడ్‌ను ట్యాంపర్ చేసినట్టు కనిపిస్తోందని, ఇది స్పష్టంగా కాపీ రైట్‌ను ఉల్లంఘించడమే అవుతుందని తెలియజేసింది.

రాహుల్ 2022లో భారత్ జోడో యాత్ర సాగించినప్పుడు కన్నడ సినిమా కేజీఎఫ్ 2 లోని సంగీతాన్ని అనధికారికంగా వినియోగించారని ఎంఆర్‌టీ మ్యూజిక్ ఫిర్యాదు చేసింది.ఈ సినిమా లోని పాటలతో రెండు వీడియోలను కాంగ్రెస్ విడుదల చేసిందని, కాపీ రైట్ హక్కును ఉల్లంఘించి వీటిని వాడుకుందని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News