Thursday, January 23, 2025

టాలీవుడ్ డ్రగ్స్ కేసు… సిఎస్ సోమేశ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

High court
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ సొమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. డ్రగ్స్ కేసులో నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీనిలో భాగంగా సిఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News