Friday, November 15, 2024

హర్యానా స్థానిక కోటాకు హైకోర్టు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రైవేట్ సెక్టార్‌లో 75 శాతం ఉద్యోగాల కోటాపై హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ల కోటాకు బ్రేక్ పడింది. ఈ రిజర్వేషన్లు చెల్లనేరవని , ఇది వివాదాస్పదం అని హర్యానా పంజాబ్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తూ ఈ కోటాను కొట్టివేసింది. పలు సవరణల తరువాత హర్యానా రాష్ట్ర ఉద్యోగ నియామకాల సంబంధిత స్థానిక అభ్యర్థుల చట్టం 2020లో ఆమోదం పొందింది. దీని మేరకు ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగాలలో హర్యానా రాష్ట్రం వారికి 75 శాతం జాబ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక లేదా డొమిసిల్ సర్టిఫికెట్లు చూపిన వారికి ఈ ప్రైవేట్ సంస్థలలో నెలకు కనీసం రూ 30000 వేతనం చెల్లించాల్సి ఉంటుందని నిర్ధేశించారు.

పైగా స్థానికత నిరూపణకు ఇంతకు ముందు 15 సంవత్సరాల నివాసం గడువు ఖరారు చేసి ఉండగా దీనిని కేవలం ఐదు సంవత్సరాలుగా ఖరారు చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం మనోహర్ లాల్ ఖట్టర్ సిఎంగా ఉంది. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ బిజెపి శ్రేణులకు కలవరం పుట్టించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News