- Advertisement -
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన రెండో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను ఢిల్లీ హైకోర్టు స్వీకరించడానికి తిరస్కరించింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించనట్లయింది. ఆయన సిఎంగా కొనసాగడానికి మార్గం సుగమం అయింది. పిల్ ను కోర్టు తిరస్కరిస్తూ ‘వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ప్రధానమైనవి’అంటూ నోటి మాటగా వ్యాఖ్యానించింది. ఇంకా కోర్టు ‘ప్రభుత్వం పనిచేయడంలేదని మేమెలా అనగలం. నిర్ణయం తీసుకోవలసింది లెఫ్టినెంట్ గవర్నర్’ అన్నది.
ఇది వరకు మొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కోర్టు స్వీకరించడానికి నిరాకరించింది. ‘అది ఒక విధంగా విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడమే కాగలదు’ అని వ్యాఖ్యానించింది.
- Advertisement -