- Advertisement -
హైదరాబాద్: ఒప్పందం ప్రకారం కాకుండా ఎక్కువ కాంప్లిమెంటరీ టికెట్లు అడిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తమను వేధిస్తున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలాగే కొనసాగితే.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని కూడా ఎస్‌ఆర్‌హెచ్ బెదిరించింది. అయితే తాజాగా విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. ఎస్‌ఆర్‌హెచ్ కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ట్రైపార్టీ ఒప్పందం మేరకు పని చేసేందుకు అంగీకరించారు. పాత ఒప్పందం ప్రకారమే 10 శాతం పాసుల కేటాయింపుకు ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సిఎ ప్రతినిధులు తెలిపారు.
- Advertisement -