Sunday, December 22, 2024

మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన… సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళ క్రికెటర్లతో కోచ్ జై సింహ అసభ్యంగా ప్రవర్తించడంతో వారు హెచ్‌సిఎకు ఫిర్యాదు చేశారు. జై సింహాను సస్పెండ్ చేస్తున్నామని హెసిఎ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. బస్సులో మద్యం తాగుతూ తనని దూషించారని మహిళా క్రికెటర్లు ఈ నెల 10న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో హెచ్‌సిఎ విచారణకు ఆదేశించింది. దీంతో జైసింహాపై హెచ్‌సిఎ మండిపడింది. కోచ్ బాధ్యతల నుంచి అతడి వెంటనే తొలగించాలని జగన్మోహన్ రావు తెలిపారు. మహిళా క్రికెటర్లకు రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, వేదింపులకు పాల్పడితే మాత్ర క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News