- Advertisement -
హైదరాబాద్: సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు హెచ్‌సిఎ లేఖ రాసింది. క్రికెట్ ఆటగాళ్లు సమర్పించిన సర్టిఫికేట్లను పోలీసులకు హెస్‌సిఎ అందించింది. వయస్సు తప్పుగా చూపిస్తూ అండర్-19 విభాగంలో 23 మ్యాచులు ఆడిన ఆటగాళ్లను పోలీసులు గుర్తించారు. హెచ్‌సిఎ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అగ్నిమాపక యంత్రాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్మ్ సామాగ్రి, కొనుగోలు వ్యవహారంలో ఈ అవకతవకలు జరిగినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం ముఖ్య కార్యనిర్వాహణాధికారి సునీల్ కంటే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- Advertisement -