Friday, January 17, 2025

20న హెచ్‌సిఎ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 20న హెచ్‌సిఎ ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శనివారం వెలువడింది. ఎన్నికల కోసం 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా ఎన్నికల కమిటీ విడుదల చేసింది. అక్టోబర్ 11 నుంచి 13వరకు నామిషేన్లను స్వీకరిస్తారు. ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, 14వ తేదీన నామినేషన్ల స్క్రూట్నీ, 16వ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News