Sunday, December 22, 2024

తొక్కిసలాటతో హెచ్‌సీఏ‌కు సంబంధం లేదు : అజారుద్దీన్‌

- Advertisement -
- Advertisement -

 

 

Azharuddin

హైదరాబాద్:   జింఖాన్ గ్రౌండ్స్‌ వద్ద క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కొనుగోలు కోసం జరిగిన తొక్కిసలాటలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA)కు ఏ సంబంధం లేదని హెచ్‌సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ తెలిపారు. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో తన తప్పుంటే అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. ‘‘అన్నీ సజావుగా నిర్వహిస్తున్నాం. టికెట్ల విక్రయాల్లో హెచ్‌సిఏ నుంచి ఏ పొరపాటూ జరగలేదు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోలేదు. అలా అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. కాంప్లిమెంటరీ పాసులు ఎవరికి ఇవ్వలేదు. డైరెక్ట్ కార్పొరేట్‌ టికెట్లు 6వేల దాకా ఉన్నాయి. 11,500 టికెట్లు ఆన్‌లైన్‌లో(పేటిఎం ద్వారా) విక్రయించాం. జింఖానా దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసు. ఆ బాధ్యత అంతా వారే చూసుకోవాలి. గాయపడిన వారికి వైద్య ఖర్చులు మేం భరిస్తాం. సుప్రీంకోర్టు కమిటీకి మేం జవాబుదారులం’’ అని అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News