Thursday, January 23, 2025

హెచ్‌సిఎల్ టెక్‌బీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: హెచ్‌సిఎల్ టెక్ బీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్‌మీడియెట్ అధికారి గోవిందరామ్ తెలిపారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలోని ఎస్‌వి జూనియర్ కాలేజీలో హెచ్‌సిఎల్ టెక్ బీలో ఉద్యోగాల కోసం జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. హెచ్‌సిఎల్ ప్రోగ్రాంకు దరఖాస్థులు చేసుకునేందుకు అభ్యర్థి ఇంటర్‌మీడియెట్ లేదా తత్సమాన కోర్సును 2022-2023లో పూర్తి చేసి ఉండాలన్నారు. ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్నారు. మ్యథమెటిక్స్ బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించాలన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లె పూర్తి కాల ఉద్యోగులుగా నియమించుకుంటారని తెలిపారు. కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు 10వేల సైఫండ్ చెల్లిస్తామన్నారు. పూర్తి స్థాయి ఉద్యోగిగా ఎంపికైతే ప్రారంభ వార్షిక వేతనం 1.70లక్షల నుండి 2.20లక్షల వరకు చెల్లిస్తారన్నారు. హెచ్‌సిఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగం చేస్తూనే బిట్స్‌పిలానీ, సాస్ర, అమీటీ, కెఎల్, ఐఐఎం, నాగాపూర్ యూనివర్సీటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడ ఉందన్నారు. ఇంటర్వూలకు వచ్చే అభ్యర్థులు పదో తరగతి పాస్ సర్టిఫికెట్ జిరాక్స్, ఇంటర్ మీడియెట్ పాస్ సర్టిఫికెట్ జిరాక్స్ ఆధార్ కార్డు నకలు, ఒక ఫోటో ఆండ్రాయిడ్ మొబైల్‌తో రావాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News