- Advertisement -
హైదరాబాద్: కంచె గచ్చిబౌలిలోని భూముల విషయంలో పెద్ద ఎత్తున రభస జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భూములను పరిరక్షించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఆ భూములు తమవేనని అంటోంది. తాజాగా ఈ భూముల విషయంపై టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. హెచ్‌సియు భూములకు బదులు ఎప్పుడో ప్రభుత్వ భూములను ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అవి ప్రభుత్వ భూములే అని పేర్కొన్నారు. హెచ్‌సియు భూములను ప్రభుత్వం లాక్కొవట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కోర్టులో కేసు నడుస్తున్నందు వల్ల భూములను స్వాధీనం చేసుకోలేదని.. కోర్టు కేసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు.
- Advertisement -