Monday, January 20, 2025

హిందీ బుక్ ఇస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారయత్నం: ఎసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిందీ నేర్చుకునేందుకు థాయిలాండ్ నుంచి హెచ్ సియుకు విద్యార్థిని వచ్చిందని ఎసిపి రఘునందన్ రావు తెలిపారు. హిందీ టెక్స్ట్ బుక్స్ ఇస్తానని చెప్పి శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విద్యార్థినిని ప్రొఫెసర్ రవి రంజన్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం కూల్ డ్రింక్ లో లిక్కర్ కలిపి ప్రొఫెసర్ ఇచ్చాడు. మద్యం తాగించి అమ్మాయిపై ప్రొఫెసర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పాటు యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇచ్చింది. రాత్రి 9 గంటలకు యూనివర్సిటీ గేట్ వద్ద ఆమెను వదిలాడు, బాధిత విద్యార్థిని తనపై దాడి జరిగినట్లు యూనివర్సిటీ అధికారులకు తెలిపింది. అమ్మాయిని తీసుకువెళ్లినప్పుడు ప్రొఫెసర్ ఇంట్లో ఎవరూ లేరు తెలిపింది. సహచర విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఎసిపి తెలిపాడు. ప్రొఫెసర్ పై ఐపిసి 354, 354ఎ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News