Wednesday, January 22, 2025

సింగర్ చిన్మయి శ్రీపాదపై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద.. భారతదేశంపై అగౌరవమైన, అనుచిత వ్యాఖ్యలు కిండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కుమార్ సాగర్ అనే హెచ్ సియు విద్యార్థి ఫిర్యాదు చేశాడు. అమ్మాయిల డ్రెస్సింగ్, తిరుగుళ్లపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడిన మాటలపై సింగర్ చిన్మయి శ్రీపాద కౌంటర్ ఇస్తూ.. మధ్యలో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ(చెత్త దేశం)గా, భారత దేశంలో పుట్టడం నా కర్మా అని చిన్మయి ఇన్‌స్టాగ్రామ్ వేదిక అన్నారు.

అన్నపూర్ణమ్మకి ఏమైనా చెప్పలనుకుంటే అమె గురించి మాత్రమే చెప్పాలి.. కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు.. భారతదేశంలో ఉంటూ.. దేశ సౌకర్యాలు అనుభవిస్తూ, దేశపు గాలి పీలుస్తూ… భారత దేశంలో పుట్టడమే కర్మ అనడం, భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధని, కోపాన్ని కలిగించే విషయమని సింగర్ చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుమార్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News