- Advertisement -
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మాజీ ప్రధాని, జనతా దళ్(సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడను కలుసుకుని దేశ ప్రగతికి ఆయన అదచేసిన విశేష సేవలను కొనియాడారు. తన కుమారులైన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, శాసనసభ్యుడు హెచ్‌డి రేవణ్ణ, మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో కలసి దేవెగౌడ ప్రధాని మోడీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
వారిని కలవడం తనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలుగచేస్తుందని సామాజిక మధ్యమం ఎక్స్‌లో ప్రధాని మోడీ తెలిపారు. దేశ అభివృద్ధికి ప్రధానిగా దేవెగౌడ చేసిన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటుందని, ఆయన ఆలోచనలు, వైవిధ్య విధానాలు దార్శనికతతో ఉంటాయని ప్రధాని ప్రశంసించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన దరిమిలా జెడిఎస్, బిజెపి పొత్తును ప్రకటించాయి.
- Advertisement -