Monday, December 23, 2024

బిజెపితో జెడిఎస్ దోస్తీ …ఎన్‌డిఎ ప్రవేశంపై సస్పెన్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకకు చెందిన జెడిఎస్ ఇక బిజెపితో కలిసి నడుస్తుంది. ఈ విషయాన్ని జెడిఎస్ నేత , మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రతిపక్షంగా కొనసాగుతూనే , బిజెపికి సహకరించాలని నిర్ణయించినట్లు కుమార చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి జెడిఎస్ పూర్తిగా వెనుకబడింది. పార్టీ సంబంధిత కీలక రాజకీయ నిర్ణయం తీసుకునేందుకు తనకు తమ నేత , మాజీ ప్రధాని దేవెగౌడ అధికారం ఇచ్చారని కుమారస్వామి తెలిపారు. తమ పార్టీ ప్రతిపక్షంగా కొనసాగుతుందని , ఇదే దశలో బిజెపితో సఖ్యత ఉంటుందన్నారు.

ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా సమయం ఉన్నందున తమ పార్టీ వైఖరి గురించి ఇప్పటికిప్పుడు చెప్పాల్సిన పనిలేదన్నారు. గురువారం రాత్రి జెడిఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే జెడిఎస్ ఎన్‌డిఎలో చేరుతుందనే వార్తలు వెలువడ్డ దశలో కుమారస్వామి తమది బిజెపితో అనధికారిక మిత్రత్వం ఉంటుందని వెల్లడించారు. కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ జెడిఎస్, బిజెపిలు ప్రతిపక్షాలుగా ఉన్న విషయాన్ని ఈ దశలో ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News