Tuesday, December 17, 2024

పెన్‌డ్రైవ్‌ల వెనుక ఉన్నది కుమారస్వామే : డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

రేవణ్ణ అభ్యంతకర వీడియోల వ్యవహారంలో పెన్‌డ్రైవ్‌లో వెనుక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఆరోపించడంపై ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఘాటుగా స్పందించారు. పెన్‌డ్రైవ్‌ల వెనుక ఉన్నది ప్రజ్వల్ బాబాయ్, మాజీ సిఎం కుమారస్వామియేనని ధ్వజమెత్తారు. వ్యక్తుల రాజకీయ జీవితాన్ని అంతం చేయడం , బ్లాక్‌మెయిలింగ్ చేయడంలో ఆయన కింగ్‌అని, ఆరోపించారు. అధికారులు, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఆయన బెదిరిస్తుంటారని, బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని ఈ మొత్తం స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రధాన పాత్రధారి ఆయనే అని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఇవన్నీ చర్చకు వస్తాయన్నారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు తాము సిద్ధమని డీకే తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News