Friday, December 20, 2024

జెడిఎస్ ఎంఎల్ఎలు పార్టీ వీడరు..

- Advertisement -
- Advertisement -

హసన్ : రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని జెడిఎస్ కర్నాటక అధ్యక్షులు, మాజీ సిఎం కుమారస్వామి విమర్శించారు. ఓ వైపు రాష్ట్రంలో బిజెపి ఆపరేషన్ లోటస్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ పేర్కొంటుంది. మరో వైపు తమ జెడిఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు దారి మళ్లించుకునేందుకు గాలాలకు దిగుతోంది. ఇదేం పద్ధతి అని కుమారస్వామి నిలదీశారు. బిజెపి, జెడిఎస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,

డికె శివకుమార్‌లు పోటాపోటీగా చెపుతున్నారు. వారిని లాగుకునేందుకు వీరు యత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోందని ఇది ఏం రాజకీయం అని కుమారస్వామి నిలదీశారు. అయితే తనకు తమ పార్టీ ఎమ్మెల్యేలపై పూర్తి నమ్మకం ఉందని, వీరిలో ఎవరూ కూడా కాంగ్రెస్ నావలోకి దూకే బాపతు కాదని స్పష్టం చేశారు. పార్టీలో అన్ని స్థాయిల్లో కలిసికట్టుగా ఉండాలని లెజిస్లేటర్లు, పార్టీ నేతల సంయుక్త సమావేశంలో జెడియూ తీర్మానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News