ముంబై : దేశంలో రూరల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యల్ని చేపట్టినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 1,060 శాఖలను బ్యాంకు ప్రారంభించనుంది. బ్యాంకు అమలు చేస్తున్న ‘ఫ్యూచర్- రెడీ’ పథకంలో భాగంగా రూరల్ బ్యాంకింగ్ లావాదేవీలు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంకులో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న అనిల్ భావనానిని నేషనల్ రూరల్ బ్యాంకింగ్ హెడ్‌గా నియమించారు. బ్యాంకు ప్రస్తుతం తన 6,342 శాఖల్లో 50 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కలిగి ఉంది. మిగిలిన 50 శాతం శాఖలు మెట్రో, నగర ప్రాంతాల్లో ఉన్నాయి. బ్యాంకు ద్వారా ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవలను దేశంలోని గ్రామాలకు తీసుకెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నామని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సీనియరు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు, నేషనల్ రూరల్ బ్యాంకింగ్ హెడ్ అనిల్ భావనాని అన్నారు.
గ్రామీణ బ్యాంకింగ్‌పై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దృష్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -