Friday, November 22, 2024

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లు పెంపు

- Advertisement -
- Advertisement -

HDFC Bank hikes FD interest rates

న్యూఢిల్లీ : ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటును పెంచిన నేపథ్యంలో దేశీయ దిగ్గజ ప్రైవేటురంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఎఫ్‌డి(ఫిక్స్‌డ్ డిపాజిట్) రేట్లను కూడా పెంచింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై 0.40 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపు నిర్ణయం ఆగస్టు 18 నుండి అమల్లోకి వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7 నుండి 29 రోజుల ఎఫ్‌డిలపై 2.75 శాతం వడ్డీ రేట్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత 30 నుండి 89 రోజుల ఎఫ్‌డిపై 3.25 శాతం, 90 6 నెలల వరకు ఎఫ్‌డిలపై 3.75 శాతం వడ్డీ రేటు ఉంటుంది. 6 నెలల నుండి ఒక సంవత్సరం లోపు ఎఫ్‌డిలకు 4.65 శాతం వడ్డీ లభిస్తుంది.

ఇక ఒక సంవత్సరం వరకు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 5.35 శాతం నుంచి 5.50 శాతానికి పెంచారు. ఒక సంవత్సరం నుండి నుండి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డిలపై 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై 5.50 శాతం వడ్డీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల 3 నుండి 5 ఏళ్ల ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ కాలంతో ఎఫ్‌డిలపై వడ్డీ రేటు 5.70 శాతం నుంచి 6.10 శాతానికి పెరిగింది. 5 నుండి 10 సంవత్సరాల వ్యవధి ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 5.75 శాతం వద్ద ఉంచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డిలపై అత్యధికంగా 6.10 శాతం వడ్డీని ఇస్తోంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువగా, అంటే 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంటే ముందు చాలా బ్యాంకులు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను పెంచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా అనేక బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News