Monday, December 23, 2024

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. కీలక ప్రకటన చేసింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తాజాగా రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టెన్యూర్లపై రుణ రేట్లు పైకి చేరాయి. బ్యాంక్ రుణ రేట్ల పెంపు నిర్ణయం ఆగస్టు 7 నుంచే అమలులోకి వచ్చింది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచేసింది. ఎంసీఎల్‌ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్ల వరకు పైకి చేరింది. టెన్యూర్ ఆధారంగా ఎంసీఎల్‌ఆర్ రేటు పెంపు కూడా మారుతుంది. ఓవర్ నైట్ ఎంసీఎల్‌ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. దంతో ఈ రేటు 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్‌ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పైకి కదిలింది. 8.3 శాతం నుంచి 8.45 శాతానికి చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News