Monday, December 23, 2024

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లకు బిగ్ అలెర్ట్..

- Advertisement -
- Advertisement -

మీకు HDFC బ్యాంక్ లో ఖాతా ఉందా?..ఉంటె ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. జూన్ 9, 16 తేదీల్లో బ్యాంక్ చెల్లింపులతో సహా అనేక సేవలు మూసివేయబడతాయి. ఈ మేరకు బ్యాంకు తన ఖాతాదారులకు ముందుగానే సందేశం కూడా పంపింది. కాగా, ఈ సేవలు అర్థరాత్రి నుండి ఉదయం వరకు 4 గంటల పాటు మూసివేయబడుతాయని హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది.

ఈరోజు రాత్రి 4 గంటలపాటు అంటే..జూన్ 9 తెల్లవారుజామున 3:30 నుండి ఉదయం 7:30 వరకు బ్యాంక్ నుండి చెల్లింపుతో సహా అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండవు. కాగా, జూన్ 16న కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు చేయవద్దని బ్యాంకు తన కస్టమర్లను కోరింది.

కస్టమర్ ఈ సౌకర్యాలను పొందలేరు

1. UPI చెల్లింపు
2. ఆన్లైన్ చెల్లింపు
3. బ్యాంకు ఖాతాలో జమ
4. నిధుల బదిలీకి సంబంధించిన IMPS, NEFT, RTGS సేవ
5. బ్యాంక్ పాస్‌బుక్ డౌన్‌లోడ్
6. తక్షణ ఖాతా తెరవడం
7. బాహ్య వ్యాపారి చెల్లింపు సేవ
8. భీమా సంబంధిత సేవలు
9. గోల్డ్ లోన్ చెల్లింపు, పునరుద్ధరణ
10. బ్యాలెన్స్, డౌన్‌లోడ్ స్టేట్‌మెంట్‌లు మొదలైనవి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News