Thursday, January 23, 2025

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ.16,373 కోట్లు

- Advertisement -
- Advertisement -

గతేడాదితో పోలిస్తే 34 శాతం పెరిగిన లాభం

న్యూఢిల్లీ : అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి క్యూ3 ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ నికర లాభం రూ.16,373 కోట్లతో 34 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. బ్యాంక్ మొత్తం ఆదాయం మూడో త్రైమాసికంలో(అక్టోబర్‌డిసెంబర్) రూ.81,720 కోట్లతో గణనీయంగా పెరిగింది. అయితే గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.51,208 కోట్లుగా ఉందని ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ బ్యాంక్ వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ఆధారంగా బ్యాంక్ లాభం రూ.12,735 కోట్ల నుంచి రూ.17,718 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ మొత్తం ఆదాయం రూ.54,123 కోట్ల నుంచి రూ.1,15,015 కోట్లకు పెరిగింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) 1.23 శాతం నుంచి 1.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎ 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గుముఖం పట్టాయి.

ఫెడరల్ బ్యాంక్ లాభం 25 శాతం జంప్
డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం రూ.1,006.7 కోట్లకు పెరిగింది. బ్యాంక్ అంచనాలను మించి రాణించింది. బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకులు ఫెడరల్ బ్యాంక్ రూ.935 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. బ్యాంక్ కేటాయింపులు రూ.91 కోట్లతో 54 శాతం పడిపోయాయి.

ఎల్ అండ్ టి ఆదాయం 1.5 శాతం వృద్ధి
డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో ఎల్ అండ్ టి నికర లాభం, ఆదాయంలో విశ్లేషకుల అంచనాలను అందుకుంది. కంపెనీ నికర లాభం రూ.336 కోట్లతో 6.6 శాతం పెరిగింది. అయితే రూ.331 కోట్ల లాభం వస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా, దీనికి అనుగుణంగా లాభం వచ్చింది. కంపెనీ ఆదాయం 1.5 శాతం పెరిగి రూ.2,421 కోట్లు నమోదు చేసింది. అయితే కంపెనీకి రూ.2,451 కోట్ల ఆదాయం వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News