- Advertisement -
న్యూఢిల్లీ : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సిఎస్‌సి) లు సంయుక్తంగా చాట్‌బోట్ ‘ఇవా’ను ప్రారంభించాయి. గ్రామ స్థాయి వర్తకులకు బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ‘ఇవా’ను ప్రారంభించినట్టు బ్యాంక్ తెలిపింది. ఈ భాగస్వామ్యం చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల గ్రామ స్థాయి వర్తలకులకు (విఎల్‌ఇ) ఆర్థిక సేవలను అందించేందుకు సాధికారత కల్పించనుంది. ఇవా ద్వారా విఎల్‌ఇలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అందిస్తున్న ప్రొడక్ట్, సేవల గురించి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
- Advertisement -