Monday, December 23, 2024

హెచ్‌డిఎఫ్‌సి పతనం ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

RBI lifts all restrictions on hdfc bank on march 11

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయి 59,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 17,808 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కీలక స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి ద్వయం భారీగా 3 శాతం నష్టాలను చవిచూసింది. ఆ తర్వాత హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టిసిఎస్ నష్టపోయాయి. మరోవైపు ఎన్‌టిపిసి, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్ 2.61 శాతం మేరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటి, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ ఇండెక్స్‌లు పతనమయ్యాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.50 వేల కోట్లు సమీకరణ

వచ్చే 12 నెలల్లో రూ.50 వేల కోట్లు సమీకరించనున్నామని ప్రైవేటురంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సోమవారం ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. మౌలిక సదుపాయాలు, సరసమైన గృహాల రుణాల కోసం టైర్1 క్యాపిటల్, టైర్2 క్యాపిటల్ బాండ్ల, దీర్ఘకాలిక బాండ్లు వంటి వాటిని జారీ చేయడం ద్వారా ఈ నిధులను సమీకరించనున్నట్టు బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 16న బ్యాంక్ నిధులను సమీకరించే ప్రతిపాదనను బ్యాంక్ బోర్డు పరిశీలించనుంది. దీనిపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఎక్సేంజ్‌కు బ్యాంక్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News