Monday, December 23, 2024

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. దీపక్ ఎస్ పరేఖ్ గురువారం హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారని, ఇది పని గంటల తర్వాత అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కేకీ మిస్త్రీని బోర్డు చైర్మన్‌గా నియమించినట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్ పదవికి కేకీ మిస్త్రీ నియామకాన్ని కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎ) అనుమతి పొందిన తర్వాత ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News