దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 25 కొత్త శాఖలను ప్రారంభించనుంది. సంస్థ తన పరిధిని విస్తరించేందుకు, దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ శాఖల ప్రారంభం ఒకభాగం. నూతనంగాప్రారంభించనున్నశాఖలు భరత్‌పూర్, భుసావల్, వరచా, బోపాల్, వాకాడ్, చిత్తోర్‌గఢ్, జల్నా, అజంగఢ్, పూర్నియా, సీతాపూర్, బస్తీ, అర్రా, బద్లాపూర్, కాశీపూర్, ఫిరోజ్‌పూర్, బరాసత్, బెర్హంపూర్(ముర్షిదాబాద్), బోల్‌పూర్, కొల్లం, ఖమ్మం, హోసూరు, హసన్, నాగర్‌కోయిల్, విజయనగరం, తంజావూరులో వుండనున్నాయి.
కొత్త శాఖ లు హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసిని దేశంలో అత్యంత అందుబాటులో ఉన్న సంపద సృష్టికర్తలలో ఒకటిగా నిలపటంతో పాటుగా ప్రతి భారతీయునికి సంపద సృష్టికర్తగా ఉండాలనే సంస్థ లక్ష్యాన్ని నొక్కి చెబుతాయి. ఈ విస్తరణ హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 250కి పైగా బ్రాంచ్‌లకు పెంచుతుంది. ఈ ముఖ్యమైన విస్తరణపై హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నవనీత్ మునోత్ మాట్లాడుతూ..”ప్రతి భారతీయుడికి సంపద సృష్టికర్తగా ఉండటమే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసి వద్ద మా లక్ష్యం. దేశవ్యాప్తంగా 25 కొత్త శాఖల జోడింపు దీనిని ప్రతిబింబిస్తుంది. సమగ్ర పెట్టుబడి పరిష్కారాలను అందించడం ద్వారా ప్రతి భారతీయుడు దేశ ఆర్థిక వృద్ధి కథనంలో అర్థవంతంగా పాల్గొనేలా అవకాశాలను కల్పించనున్నాము” అని అన్నారు.