Wednesday, January 22, 2025

33 ఏళ్లు క్రితం మరణించాడు అనుకున్నారు…. ఇప్పుడు తిరిగొచ్చాడు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 33 ఏళ్ల కింద తప్పిపోయిన వ్యక్తి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. బన్సూర్ గ్రామంలో హునుమాన్ సైనీ అనే వ్యక్తి తనకు 42 ఏళ్లు ఉన్నప్పుడు ఢిల్లీలోని ఓ దుకాణంలో పని చేసేవాడు. ఆయన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు. ఓ మాతా మందిరంలో 33 ఏళ్లు పూజలు చేస్తూ ఉండిపోయాడు. సైనీకి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.  భర్త లేకపోవడంతో భార్య అందరి పెళ్లిలు చేసింది.

Also Read: సరిలేరు మీకెవ్వరూ.. సార్

75 ఏళ్ల వయసులో అతడు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. హానుమాన్ సైనీ ఇంటికి రావడంతో కుటుంబ సోదరీలు, సోదరీమణిలు, కూతుళ్లు ఇంటికి చేరుకున్నారు.  2022లో భూమి పట్టా చేసుకోవడానికి సైనీ తనయులు కోర్టు ఉత్తర్వులతో మరణ ధ్రృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి పటాన్ కోటకు రైలులో ప్రయణించేటప్పుడు టికెట్ లేకపోవడంతో టిటి అడిగాడని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో పఠాన్‌కోట్‌కు ఒక టికెట్ ఇచ్చాడని పేర్కొన్నారు. 33 సంవత్సరాలు కంగ్రా మాతాకు పూజలు చేశానని, ఇంటికి వెళ్లమని మాతా ఆదేశించడంతో వచ్చానని సైనీ చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News