అబూధాబి: “ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషభ్ పంత్‌నే కొనసాగించాలని మేనేజ్‌మెంట్ భావించడంతో ఆ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం శ్రేయాస్ అయ్యర్‌కు లభించలేదు, కానీ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ అయ్యే అర్హతలు అతడిలో మెండుగా ఉన్నాయి” అని ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్ అభిప్రాయపడ్డాడు.
“అతడు భుజం గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. చాలా ఒత్తిడిలో కూడా ఉన్నాడు. అతడిని టి20 భారత జట్టుకూ ఎంపికచేయలేదు. విలేకరుల సమావేశంలో నేను గమనించిందేమిటంటే, భారత జట్టుకు భవిష్యత్‌లో సారథ్యం వహించే సత్తా అతడిలో బాగా ఉన్నాయి” అని యూట్యూబ్ ఛానల్‌లో హగ్ తెలిపాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం ఆడేందుకు ఫిట్‌నెస్ కలిగి ఉన్నట్లు ప్రకటించబడ్డాడు. కోవిడ్-19 కారణంగా ఐపిఎల్ 2021 నాలుగు నెలలు వెనక్కి నెట్టబడిందన్నది తెలిసిన విషయమే.
భారత క్రికెట్ జట్టు భవిష్యత్ కెప్టెన్ అతడే కావొచ్చు!
- Advertisement -
- Advertisement -
- Advertisement -