Thursday, April 24, 2025

ఆదిలాబాద్‌లో విషాదం.. అవార్డు అందుకున్న గంటలోనే మృతి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీసులో మేనేజర్ గా పనిచేస్తున్న దివ్యాంగుడు మృతిచెందాడు. మృతుడు దివాకర్(56) రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న గంటలోనే ఇంటికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News