- Advertisement -
రాయ్‌పూర్: మూఢనమ్మకం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పిల్లలు పుట్టడంతో లేదని ఓ వ్యక్తి కోడి పిల్లను మింగాడు. గొంతులో కోడి పిల్ల ఇరుక్కొని ఊపిరాడక సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చింద్‌కాల్ గ్రామంలో ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. గత కొంత కాలంగా పిల్లలు పుట్టకపోవడంతో ఓ మాంత్రికుడిని ఆనంద్ కలిశారు. మాంత్రికుడి సలహా మేరకు బతికున్న కోడి పిల్లను మింగాలని సూచించాడు. బతికున్న కోడి పిల్లను మింగగానే అది గొంతులో ఇరుక్కొని స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఊపిరాడక ఆనంద్ చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గొంతులో నుంచి బతికున్న కోడి పిల్లను బయటకు తీశారు.
- Advertisement -