Sunday, December 29, 2024

ప్రియురాలి కూతురుతో పారిపోయిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తల్లితో సహ జీవనం చేస్తూ కూతురిని లోబరుచుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకొని తన కూతురుతో కలిసి ఉంటుంది. ఇండ్లా రాజు అనే వ్యక్తితో గత కొంత కాలంగా సహజీవనం చేస్తుంది. సదరు మహిళ కూతురు పదో తరగతి చదువుతుంది. మహిళతో సహజీవనం చేస్తూ కూతురుతో ప్రేమాయణం నడిపించాడు. మాయ మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. రెండు రోజుల క్రితం పాఠశాలకు బాలికను తీసుకెళ్లాడు. సాయంత్రం వరకు బాలిక కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. రాజు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. రాజుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News