Sunday, January 12, 2025

ఆయనే ఓ ఆయుధం

- Advertisement -
- Advertisement -

దూకుడు, సాహసమే కెసిఆర్ విజయ మంత్రం

సొంత ఇమేజీతోనే టీమ్‌ను గెలిపించుకునే వ్యూహం

మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి విపక్షాలను ఆత్మరక్షణలో పడేసిన సిఎం

ఉత్తర తెలంగాణలో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు కామారెడ్డి అస్త్రం వామపక్షాలతో తెగదెంపుల వెనుక లోతైన అధ్యయనం

(మిట్టపల్లి శ్రీనివాస్)
అదే ధీమా.. అదే తెగువ.. అదే దూకుడు.. అవే వ్యూహాలు.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే మొత్తం 119 నియోజక వర్గాల్లో 115 నియోజక వర్గాలకు అభ్యర్థులను అందరి కన్నా ముందుగా బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఒకేసారి ప్రకటించడం రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. 2018 ఎన్నికలతో పోలిస్తే అంతకన్నా పదిహేను రోజు లు ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించి అందరినీ కెసిఆర్ మరోసారి ఆశ్చర్యపరిచారు. విపక్షాలు మేల్కొనక ముందే వారు డీలా పడేలా కెసిఆర్ తన టీంలోని సిట్టింగ్ ఎంఎల్‌ఎలో 97 అభ్యర్థులను రీనామినేట్ చేస్తూ యుద్ధ భేరి మోగించారు. పార్టీ అధినేతగా తనకున్న ఇ మేజ్, గడచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకున్న విశ్వాసం అభ్యర్థుల ప్రకటనకు దారి తీసింది.

ఈ దఫా పార్టీలో సిట్టింగ్‌లకు చాలామందికి సీట్లు రావనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఆయన 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సిట్టింగ్ ఎంఎల్‌ఎల విషయంలో అక్కడక్కడా ఆ రోపణలు ఉన్నా, అభ్యర్థుల మార్పుపై స్వపక్షం నుంచే ఎన్ని ఒత్తిడిలు వచ్చినా వాటిని ఖాతరు చే యకుండా తన టీమును, తన ఇమేజ్‌తో గెలిపించాలనే వ్యూహం అభ్యర్థుల ప్రకటన ద్వారా వెల్లడైంది. అభ్యర్థుల జాబితాను 2018తో సామాజి క వర్గాల కోణంలో పోలిస్తే భారీగా మార్పులు ఏమీ లేవు. స్వల్పంగా మార్పులు కనిపించాయి. గతంలో ఒసిలకు 59 సీట్లు ఇస్తే ఈసారి 58 ఇచ్చారు. జనాభాలో సింహ భాగంగా వున్న బిసిలకు గతంలో 26 మందికి ఇవ్వగా ఈసారి 23 మందికి ఇచ్చారు. గతంలో మున్నూరు కాపులకు 8 ఇవ్వగా ఈసారి 11కు పెంచారు. మిగతా సా మాజిక వర్గాల్లో కీలకమైన మాదిగ, మాలలకు గతంలో 18 ఇవ్వగా ఈసారి 19 మందికి ఇచ్చా రు. ఎస్‌టిల్లో గతంలోనూ, ఇప్పడూ 12 సీట్లు ఇచ్చారు.

ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సామాజిక వర్గాల్లో ఆర్థిక, రాజకీయ బలాల ఆధారంగా టికెట్లను కేటాయించినట్లుగా పరిశీలకు లు చెబుతున్నారు. కేవలం 7 సిట్టింగ్ సీట్లలో అనివార్య పరిస్థితుల్లో అభ్యర్థులను మాత్రమే మార్చారు. స్టేషన్‌ఘన్‌పూర్, ఖానాపూర్, వేములవాడ, బోథ్, ఉప్పల్, వైరాలలో మాత్రమే సిట్టింగ్‌లను మార్చాల్సి వచ్చిందని దానికి కారణాలు వారికి కూడా తెలుసని కెసిఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ విక్టరీ సాధించాలనే ఏకైక లక్ష్యంతో గడచిన ఆరు నెలలుగా క్షేత్ర స్థాయిలో తీవ్రంగా కసరత్తు చేసి చివరకు శుభ ఘడియల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి విపక్షాలను షాక్‌కు గురి చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గాల్లో రెండు చోట్లా పోటీ చేస్తానని కెసిఆర్ ప్రకటించడం వెనుక కూడా వ్యూహం కనిపించింది.

రెండు సీట్లకు పోటీ ప్రకటించడం ద్వారా ఉత్తర తెలంగాణలో కూడా పార్టీ కేడర్, లీడర్లలో ఉత్తేజం పెంచడం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గణనీయంగా వున్న మైనారిటీల మద్దతు సాధించే వ్యూహం రెండో సీటు పోటీ స్పష్టం చేస్తున్నది. నిజానికి కెసిఆర్ గజ్వేల్‌కు పరిమితమైనా గెలుపుపై రెండో అనుమానం లేదు. కాని ఉత్తర తెలంగాణలో ప్రత్యర్థి పార్టీల బలానికి చెక్ పెట్టి తన ప్రభావాన్ని ఉత్తర తెలంగాణ అంతటా విస్తరించాలన్న లోతైన వ్యూహమే రెండు సీట్ల పోటీ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో వివిధ రాజకీయ సమీకరణల దృష్టా సిపిఐ, సిపిఎంలతో పొత్తు వుండదని అభ్యర్థుల జాబితా రుజువు చేసింది. సిపిఐ, సిపిఎంలు చెరి మూడు స్థానాలు పొత్తులో భాగంగా కోరినా ఆయన తన సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు తిరిగి కేటాయించారు. వామపక్షాలు కోరిన ఆరు సీట్లలో వారి బలం పరిమితంగా వుండడం, పార్టీలో సిట్టింగ్‌లపై ఇక్కడ అంతగా వ్యతిరేకత లేకపోవడం వామపక్షాలతో తెగతెంపులకు కారణంగా చెప్పవచ్చు. తెలంగాణలో ప్రబల రాజకీయ శక్తిగా వున్న ఎంఐఎం మిత్ర పక్షమేనని ప్రకటించిన కెసిఆర్ ఆ పార్టీ బలంగా వున్న ఎనిమిది స్థానాల్లో కూడా అభ్యర్థులను ఫ్రెండ్లీ కాంటెస్ట్‌లో భాగంగా ప్రకటించి తన రాజకీయ చతురతను మరోసారి బహిర్గతం చేశారు.

ఎంఐఎంతో పొత్తు హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ఉమ్మడి పది జిల్లాల్లో 18కి పైగా సీట్లలో మైనారిటీలు నిర్ణయాత్మక పాత్ర వహించే పరిస్థితి వుండడంతో ఎంఐఎం మిత్రబంధాన్ని మరింత పటిష్టం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం 119 స్థానాల్లో 7 స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చి 2 స్థానాల్లో సిట్టింగ్‌ల అభిప్రాయం ప్రకారం అభ్యర్థులను మార్చారు తప్ప మిగతా అంతా సిట్టింగ్ ఎంఎల్‌ఎలనే ప్రకటించారు. మల్కాజ్‌గిరి ఎంఎల్‌ఎ మైనంపల్లి హనుమంతరావు తనకూ, తన కుమారుడికీ రెండు సీట్లు ఇస్తే తప్ప పోటీ చేయమని ప్రకటించినా కెసిఆర్ మైనంపల్లికి మాత్రమే సీటు కేటాయించారు. అభ్యర్థుల ప్రకటన రోజున మైనంపల్లి చేసిన ప్రకటన గురించి విలేకరులు కెసిఆర్ దృష్టికి తీసుకు రాగా సిట్టింగ్‌లకే సీట్లలో భాగంగా హనుమంతరావుకు టిక్కెట్ ఇచ్చాం. పోటీ చేయడం, చేయకపోవడం, పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండడం, వుండకపోవడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని కెసిఆర్ ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వరంగల్‌లో అక్టోబర్ 16న జరిగే సింహ గర్జనలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా వున్న కాంగ్రెస్, బిజెపిలు అభ్యర్థుల కసరత్తును నాన్చుతూ వున్న దశలోనే కెసిఆర్ మెరుపు వేగంతో అభ్యర్థులను ప్రకటించి తనేమిటో మరోసారి నిరూపించుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాను వినూత్నంగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపనూ తాకడం, ప్రతి కుటుంబం ఎకౌంట్‌కు నేరుగా దళారుల ప్రమేయం లేకుండా చేరడం, ఇక్కడ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా అమలయ్యి దేశానికే రోల్ మోడల్‌గా నిలవడంతో ప్రజల ఆదరణ, ఆశీస్సులు తనకే వుంటాయని అంతులేని విశ్వాసం కెసిఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనకు దారి తీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ, కెసిఆర్ కిట్లు, దళిత, మైనారిటీ, బిసి బంధులాంటి అత్యంత జనాదరణ పొందిన పథకాలు, విద్య, సాగునీటి రంగంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తన హ్యాట్రిక్ విజయానికి దారి తీస్తాయని ఆయన భావిస్తూ సంచలన ప్రకటన చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యర్థులపై అక్కడక్కడా మైనస్ మార్కులు వున్నా మొత్తంగా తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతున్న విషయాన్ని ప్రజలు గమనించారని, తన సుపరిపాలన ఫలితాలు క్షేత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని వివిధ సర్వేల ద్వారా కెసిఆర్ తెలుసుకొని అందుకనుగుణంగా మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాలు విసిరారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News