Monday, December 23, 2024

ప్రేమ పేరుతో వేధించాడు.. పెళ్లి చేసుకోలేదని గుట్టల్లోకి తీసుకెళ్లి

- Advertisement -
- Advertisement -

వనపర్తి: ప్రేమించాలని వేధించాడు… పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు… నిరాకరించడంతో ఆమెను హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లాకు చెందిన బత్తిన శ్రీశైలంకు హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడు సాయిప్రియ అనే యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడ్డాడు.. పలుమార్లు వేధించడంతో యువతి తన ఇంట్లో చెప్పడంతో యువకుడిని కుటుంబ సభ్యులు మందలించారు. సాయి ప్రియకు శ్రీశైలం ఫోన్ చేసి మహబూబ్‌నగర్ జిల్లాకు రావాలని కోరాడు. అతడి చెప్పినట్టే మహబూబ్‌నగర్ వెళ్లింది. సాయి ప్రియ ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని మానాజీపేట పరిసర ప్రాంతంలోని మబ్బుగుట్టల్లోకి ఆమెను తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు. ఆమె నిరాకరించడంతో చున్నీని మెడకు చుట్టి శ్రీశైలం చంపేశాడు. అనంతరం తన స్నేహితుడి సాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తన కూతురు కనిపించడం లేదని దంపతులు వెంకటేష్, లక్ష్మి కాటేదాన్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. శ్రీశైలంపై అనుమానం ఉందని చెప్పడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైనశైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. గాఢంగా ప్రేమించానని, పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చంపేశానని పోలీసులు ఎదుట అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News