Monday, December 23, 2024

మూగజీవాల మనసెరిగినవాడు

- Advertisement -
- Advertisement -

ఎంపి సంతోష్‌కుమార్ తీసిన ఫొటోలు అద్భుతం
జోగినిపల్లి పుస్తకం వింగ్స్ ఆఫ్ పాషన్‌ను ఆవిష్కరించిన అనంతరం గ్లోబల్ స్టార్ రాంచరణ్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని, అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అని స్టార్ రాంచరణ్ పేర్కొనారు. ఎంపి సంతోష్ కుమా ర్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన ‘వింగ్స్ ఆఫ్ పాషన్’ పుస్తకాన్ని శనివారం తన నివాసంలో జోగినిపల్లితో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని బుక్‌లో వారు చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుందని, జీవుల పట్ల ఎంతో కరుణ, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవా సం ఉంటే తప్ప.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్థ్ధం చేసుకోలేమన్నారు.

పక్షులు, మూగజీవాలను అర్థం చేసుకోవడానికి వారు ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోదు. దేశంలో ఎందరో ఫొటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ మాదిరిగా ఫొటోలు తీసి వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక్కరే కావచ్చని నా అభిప్రాయమని తెలిపారు. కళ, కళ కోసం కాదు ప్రజల కోసమని మన పెద్దలు అంటా రు. సంతోష్ కుమార్ కూడా తన ఫొటోల ద్వారా పక్షులు, జంతువుల, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూ తన కళను ప్రదర్శిస్తూ పక్షు లు, మూగజీవాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో ప రిణతితో కూడిన బాధ్యతని, దూరమైన మొక్కలు నాటిస్తున్నారు. మరోపక్క వాటి పట్ల ప్రజ ల్లో అవగాహన కల్పిస్తూ ప్రకృతి సమతుల్యత కోసం పరితపిస్తున్నారని నిజంగా జోగినిపల్లి సంతోష్ కు మార్ కృషికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News