Monday, December 23, 2024

మారు కూతురిని పెళ్లి చేసుకున్న ఘనుడు… తల్లి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

He marriages wife daughter

అమరావతి: భర్త లేని మహిళను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె కూతురును కూడా తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నక్కాన లక్ష్మి భర్త చనిపోవడంతో 17 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. డ్రైవర్ సురేష్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్న క్రమంలో అతడి కన్ను లక్ష్మి కూతురుపై పడింది. తాను తిరుపతికి వెళ్లే వాహనంలో ఒక సీటు ఖాళీగా ఉందని లక్ష్మి కూతురును తీసుకెళ్లానని నమ్మబలికాడు. తిరుపతికి తీసుకెళ్లిన తరువాత కూతురును పెళ్లి చేసుకున్నానని చెప్పి వెంటనే ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. వెంటనే లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News