Sunday, December 22, 2024

యువతిని రైలు కింద తోసేసి…

- Advertisement -
- Advertisement -

 మన తెలంగాణ /తమిళనాడు న్యూస్: ప్రేమించలేదని యువతిని రైలు కింద తోసేసి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆదంబాక్కాని ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాణిక్యం అనే కానిస్టేబుల్‌కు సత్య(20) అనే కూతురు ఉంది. ఆమె ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. స్థానికంగా ఉండే సతీష్(23) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని పలుమార్లు వెంటపడ్డాడు. యువతి మాత్రం అతడి ప్రేమను తిరస్కరించాడు. గురువారం ఆమె కాలేజీకి వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో అతడి అక్కడికి వచ్చి ఆమె గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తాంబరం నుంచి రైలు కిందకు యువతిని తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే అతడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి సిసి టివి కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

 

ఇవి కూడా చదవండి

ఉప్పల్ లో తండ్రీకొడుకులు దారుణ హత్య

ఎర్రబెల్లితో ముచ్చటించిన వృద్ధుడు

కోమటిరెడ్డి… కోవర్టు రెడ్డి కావొద్దు: విహెచ్

ఓటర్లు కెసిఆర్ ను మరచిపోయే పరిస్థితి లేదు…

ప్రేమించిన టీచర్‌కు పెళ్లి నిశ్చయం.. విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News