Friday, December 20, 2024

కాలనీల సంక్షేమం, అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని ప్ర భు త్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో కాలనీ వెల్పేర్ అసోసియేషన్ కాలనీ గృహ యజమానులందరి సహకారంతో నిర్మించిన కాలనీ వె ల్పేర్ అదనపు భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాదాపూర్, కొండాపూర డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, షేక్‌హమీద్ పటేల్‌లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల సంక్షేమానికి అభివృద్ధికి తన పూరి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. వినాయక్‌నగర్ కాలనీలో నిర్మించిన భవనం కాలనీ అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కాలనీ వాసులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నచిన్న ఫంక్షన్‌ల, జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే గాం ధీకి, కార్పొరేటర్ పూజిత, జగదీశ్వర్‌గౌడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నామని రాబోయే ఎన్నికల్లో మరోసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్‌గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వాలా హరీష్‌రావు, నాయకులు లకా్ష్మరెడ్డి, దాత్రిగౌడ్, రఘునాథ్, వెంకటేశ్వరరావు, దామోదర్‌రెడ్డి, బాబుమోహన్ మల్లేష్, అబ్దుల్ రహమాన్, కాలనీ వాసులు క నికి రెడ్డి, ప్రసాద్, సుభాష్‌రావు, సు భాష్ చంద్రబోస్, నవీన్, సుబ్రమణ్యం రాజు, శ్రీకాంత్, కార్తిక్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News