Saturday, November 23, 2024

అదరగొడుతున్న హెడ్, అభిషేక్

- Advertisement -
- Advertisement -

విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు

తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కిందటి సీజన్‌లో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. ఐపిఎల్‌లోనే అత్యధిక స్కోర్ల రికార్డును రెండు సార్లు బద్దలు కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఈ క్రమంలో ఐపిఎల్‌లో అత్యధిక స్కోరును సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులు చేసి తన రికార్డును తానే తిరగరాసింది. హైదరాబాద్ ఈ సీజన్‌లో పలుసార్లు 200కి పైగా స్కోర్లను సాధించింది. గతం ఉన్న 231 పరుగుల అత్యధిక పరుగుల రికార్డును కలిగిన ఉన్న హైదరాబాద్ ఈ ఇప్పటికే మూడు సా 250కి పైగా స్కోరును నమోదు చేసింది. గతం లో బౌలింగ్‌నే నమ్ముకున్న హైదరాబాద్ ఈసారి మాత్రం బ్యాటింగ్‌నే ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోతున్నారు.

ఇద్దరు పోటీ పడి ఆడుతూ ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తిస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు ఆయా జట్ల బౌలర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్, హెడ్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించారు. పవర్‌ప్లేలో ఏకంగా 125 పరుగులు దండుకుని సరికొత్త ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఇటు ట్రావిస్ అటు అభిషేక్‌లు తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్ల బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడుతున్నారు. వీరి జోరుతో హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోరును నమోదు చేస్తోంది. ముంబైపై 277, బెంగళూరుపై 287, ఢిల్లీపై 266 పరుగుల రికార్డు స్కోర్లను హైదరాబాద్ నమోదు చేసింది.

దీంతో ఐపిఎల్‌లోని ఆయా జట్ల బౌలర్లు సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అంటేనే హడలిపోతున్నారు. ముఖ్యంగా హెడ్, అభిషేక్‌లను కట్టడి చేయడం ఆయా జట్ల బౌలర్లకు శక్తికి మించిన పనిగా తయారవుతోంది. హెడ్ ఈ సీజన్‌లో ఏడు మ్యా చ్‌లు 324 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మరో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక హె డ్ 216 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు సాధించ డం విశేషం. మరోవైపు అభిషేక్ శర్మ ఏడు మ్యాచుల్లో 257 పరుగులు సాధించాడు. అతని స్ట్రయిక్‌రేట్ 215 కావడం గమనార్హం. హెన్రిచ్ క్లాసెన్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌కు అండగా నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఈ ముగ్గురు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచడంతో సన్‌రైజర్స్ వరుస విజయాలను న మోదు చేస్తోంది. రానున్న రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో హైదరాబాద్ బ్యాటర్లు ఉన్నారు. దీంతో ప్రత్యర్థి జట్ల బౌ లర్లకు ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News