Friday, November 22, 2024

అంచనాలకు మించి రాణించారు

- Advertisement -
- Advertisement -

అంచనాలకు మించి రాణించారు
యువ క్రికెటర్లపై రవిశాస్త్రి పొగడ్తలు

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగిన సిరీస్‌లో టీమిండియా యువ క్రికెటర్లు అసాధారణ ఆటతో చెలరేగి పోయిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయమని ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌గవాస్కర్ టెస్టు సిరీస్‌ను భారత్ 21తో గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వారి ప్రతిభను కొనియాడుతూ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలోనే చాలా కీలకమైందన్నాడు. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలిన జట్టు చివరికి సిరీస్ సాధించడం గొప్ప విషయమన్నాడు. దీనికి సమష్టి పోరాటమే కారణమన్నాడు. ప్రతి ఆటగాడు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా పోషించాడన్నాడు. జట్టు విజయంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నాడు. పుజారా ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుగా అండగా నిలిచాడన్నాడు. ఇక యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, శార్దూల్, సిరాజ్, సైని, నటరాజన్, సుందర్ తదితరులు అసాధారణతో రాణించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నాడు. ఇక అజింక్య రహానె అద్భుత కెప్టెన్సీతో జట్టును నడిపించిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువేనన్నాడు. ఇక తన పర్యవేక్షణలో టీమిండియా చారిత్రక విజయం సాధించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Head Coach Ravi Shastri praises Team India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News