Monday, December 23, 2024

కాకతీయ కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి..

- Advertisement -
- Advertisement -

కరీనంగర్ శివారు కాకతీయ కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని తిమ్మాపూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ దండు మల్లయ్య గతంలో కాంగ్రెస్ ఎంఎల్ఎ శ్రీధర్ బాబు, బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ లకు అంగరక్షకుడిగా పనిచేశారు. ప్రస్తుతం పెద్దపల్లిలో మల్లయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News