Thursday, January 23, 2025

కాచనపల్లి పిఎస్ లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రమాదం జరిగింది. పిఎస్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా సంగేమ్ మండలంలోని గవిచర్లకు చెందిన సంతోష్‌(30), కాచనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆరునెలల నుంచి హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం అర్ధరాత్రి స్టేషన్‌లో ఆయుధాలు పరిశీలిస్తుండగా ఓ తుపాకీ మిస్ ఫైర్ అయి సంతోస్ శరీరంలోకి దూసుకుపోవడంతో  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Head constable died after gun misfire in Bhadradri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News