Wednesday, January 22, 2025

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

ఖానాపురం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మద్దెల సూర్యనారాయణ మంగళవారం ఉదయం గుండెపోటు రాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ సిపి ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున సూర్యనారాయణ దహన సంస్కారాల కోసం రూ. 20 వేలను అందజేశారు. ఖానాపురం ఎస్సై తిరుపతి, వరంగల్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభన్, ఖానాపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News