Sunday, December 22, 2024

డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: చిన్న పెద్ద తేడా లేకుండా పలువురు గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఓ యువ పోలీస్ కానిస్టేబుల్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో దుర్మరణం చెందాడు. రవి కుమార్ అనే వ్యక్తి ఢిల్లీలోని రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. స్టేషన్ హౌస్ అధికారిగా బదిలీ కావడంతో రవికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పలు పాటలకు తన సహ ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రవి చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రవి కుమార్ 2010 ఢిల్లీ పోలీస్ విభాగంలో చేరాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 45 రోజుల క్రితమే యాంజియోగ్రఫీ పరీక్ష చేయించుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News