Monday, January 20, 2025

అనుమానస్పదస్థితిలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అనుమానస్పదస్థితిలో హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్రీమన్నారాయణ హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి బాత్రూంలో కాలుజారి పడ్డాడని, వెంటనే కూకట్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లిన జగద్గిరిగుట్ట పోలీసులు శ్రీమన్నారాయణ తలపై గాయాలు ఉండడం, కుటుంబ సభ్యులు పొంతన లేకుండా సమాధానాలు చెప్పడంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్రీమన్నారాయణ మృతితో జగద్గిరిగుట్ట పోలీసులు విషాదంలో మునిగారు, తమతో పనిచేసిన వ్యక్తి అకాలంగా మరణించడంతో తీవ్ర దిగ్బాంతీ వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఇన్స్‌స్పెక్టర్ సైదులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ మృతదేహాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌రావు కూకట్‌పల్లి ఆస్పత్రిలో నివాళి అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News