Sunday, January 19, 2025

ఖైరతాబాద్ లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తుపాకీ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామయ్య ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి రామయ్య మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News